Grama Vani

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా,కేంద్ర మంత్రి బండిసంజయ్ అమీర్ పేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలిన

Featured

September 17, 2025 | Category: Politics
88 views

AMEERPEWT COMMUNITY HEALTH CENTRE

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా,కేంద్ర మంత్రి బండిసంజయ్ అమీర్ పేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పరిశీలిన

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా హైదరాబాద్ - అమీర్ పేట లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో కలసి పరిశీలించారు . హాస్పిటల్ లోని అన్ని విభాగాలు తిరిగి చికిత్స పొందుతున్న రోగులతో కలసి మాట్లాడారు . హాస్పిటల్ లో అందిస్తున్న వైద్య సేవలు , చికిత్సలపై మంత్రి దామోదర్ రాజనర్సింహా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం PLAN INTERNATIONAL సంస్థ అద్వర్యం లో నిర్వహిస్తున్న బ్లడ్ డొనేషన్ క్యాంపు ను ప్రారంభించారు . బ్లడ్ డోనార్ లకు సర్టిఫికెట్స్ లను కేంద్ర మంత్రి బండి సంజయ్ గారితో కలసి అందించారు . ఆసుపత్రి మెడికల్ సూపరింటెoడెంట్ తో ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవల బలోపేతం పై చర్చించారు . క్యాడర్ స్ట్రెంత్ , ప్రస్తుతం సిబ్బంది , డాక్టర్లు , నర్సింగ్ సిబ్బంది , రోగుల IP , OP  పై చర్చించారు . ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన పై చర్చించారు . ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా మెడికల్ సూపరింటెoడెంట్ ను ఆదేశించారు .

ఈ కార్యక్రమం లో MLC అడ్డంకి దయాకర్ , హెల్త్ సెక్రటరీ డా . క్రిస్టినా , DME డా . నరేంద్ర కుమార్ , TVVP కమిషనర్ డా . అజయ్ కుమార్ , డైరెక్టర్ హెల్త్ డా . రవీంద్ర కుమార్ , ఇతర వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు .