September 29, 2025 |
Category: Raikode
120 views
రాయికోడ్ గ్రామం లోని ముమ్మదేవి ఆలయంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
సరస్వతి దేవిగా పూజలు అందుకున్న ముమ్మాదేవి
రాయికోడ్,
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో గల శ్రీ ముమ్మాదేవి ఆలయంలో శరన్నవ రాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం అమ్మవారు సరస్వతి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులతో పాటు గ్రామస్తులు అధికారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో రోజు భజన, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదానం చేస్తున్నారు. రాయికోడ్ చెందిన ముత్యాల కులస్తులు వ్యాపారాల నిమిత్తం రాష్ట్రంలోని నలుమూలల్లో నివాసం ఉంటున్న వారు సొంత ఊరికి తరలివచ్చి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్, బీదర్ ప్రాంతాల నుండి కాలినడకన తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు