Grama Vani

హమాస్ అంతం - బెంజిమెన్ నేతన్యాహు పంతం

Featured

September 27, 2025 | Category: World
62 views

హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.

హమాస్ అంతం -  బెంజిమెన్ నేతన్యాహు పంతం

ఐరాస: హమాస్‌కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్‌ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్నప్పటికీ తాను వెనక్కి తగ్గేదే లేదని, తన వైఖరిలో మార్పు రాదని నెతన్యాహు శుక్రవారం ఐరాస సర్వ ప్రతినిధి సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రసంగానికి ఆయన సిద్ధమవుతుండగానే, పలు దేశాల ప్రతినిధులు సమావేశం నుంచి వాకౌట్‌ చేయడం కన్పించింది.