September 23, 2025 |
Category: Zaheerabad
95 views
మొగుడంపల్లి మండలం ఖంజామల్పూర్ ( భవనామ్మపల్లీ ) గ్రామంలోని భవాని మాతా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి
భవానిమ్మ పల్లెలో ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు
మొగుడంపల్లి మండలం ఖంజామల్పూర్ ( భవనామ్మపల్లీ ) గ్రామంలోని భవాని మాతా ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా జరిగే నవరాత్రి వేడుకలలో భాగంగా ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారు. చత్రపతి శివాజీ మహారాజ్ స్థాపించిన చారిత్రక ప్రాధాన్యత గల భవానిమాతా ఆలయం కావడం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాదయాత్ర తరలివచ్చి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు.