September 21, 2025 |
Category: Raikode
75 views
man drowns and swept away
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కూసునూర్ గ్రామం లో వాగు దాటుతూ కొట్టుకోపోయిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కుసునూర్ గ్రామానికి చెందిన ముదిరాజ్ కృష్ణ సాయంత్రం రాయికోడ్ చౌరస్తా లో సంత కు వెళ్లి తిరిగివస్తున్నా అయన వాగు దాటుతుండగా కొట్టుకోపోయాడు అని స్థానికులు పోలీసులు తెలిపారు. అయన ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఆ వంతెన అనేకసార్లు వరదనీటిలో మునుగుతూ తేలుతూ ఉంది. పోలీసులు కూడా ఇటు విషయాన్ని వివిధ సామాజిక ఉద్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగింది. బ్రిడ్జిని కూడా వరద ఉన్నప్పుడు మూసి వేయడం జరిగింది. వర్షం తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా వచ్చేసరికి అధికారులు దారి మూసేసే లోపు నిర్లక్ష్యం వలన వ్యక్తి ప్రమాదానికి గురై వరద ప్రవాహంలో కొట్టుకపోవడం జరిగింది.కావున ప్రజలు నీటి ప్రవాహాలను దాటెటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వీయ నియంత్రణ చర్యలను పాటించి ప్రాణాలను రక్షించుకోవాలి.